ట్రంప్ విజయం వేళ.. ధోనీతో గోల్ఫ్ ఆడిన పాత వీడియో వైరల్.. మీమ్స్ అయితే మరో లెవెల్!
- 2023లో ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన భారత మాజీ కెప్టెన్
- దాని తాలూకు వీడియో, ఫొటోలను వైరల్ చేస్తున్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్
- హాస్యభరితమైన మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్న వైనం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో మరోమారు ఆయన అగ్రరాజ్యం అధ్యక్షపీఠం అధిరోహించనున్నారు. అయితే, ఈ విజయం వేళ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ట్రంప్ గోల్ఫ్ ఆడిన పాత వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై భారత క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. కాగా, భారత అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన ధోనీ 2023లో ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు.
'తలా ఫర్ రీజన్' అనే పాప్యులర్ లైన్‌తో క్యాచీ మీమ్స్ క్రియేట్ చేశారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్. అందులో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం.
"అమెరికా (AMERICA) = 7 లెటర్స్, తలా ఫర్ ఏ రీజన్. మా ధోనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సరదాగా గోల్ఫ్ ఆడతాడు. ఫలితం ట్రంప్ అధ్యక్షుడయ్యారు" అని ఒకరు పేర్కొన్నారు. క్రికెట్‌లో ధోనీ జెర్సీ నెం. 7ను ప్రస్తావిస్తూ ఈ మీమ్ క్రియేట్ చేశారు.
"ధోనీతో ఒక్క గోల్ఫ్ మ్యాచ్. ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ పీఠం" అని మరొకరు పేర్కొన్నారు. "తలా ధోనీ గైడెన్స్ ఎప్పుడూ వ్యర్థంకాదు. కంగ్రాట్స్ మిస్టర్ ట్రంప్" అంటూ ఇంకొకరు మీమ్స్ పెట్టారు.
కాగా, 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంఎస్‌డీ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో 2023లో గోల్ఫ్ ఆట కోసం ట్రంప్ తన గోల్ఫ్ కోర్స్‌కు మహీని ఆహ్వానించడం జరిగింది.