ట్రంప్ హవాతో దూసుకెళ్లిన టెస్లా షేర్లు
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం
- ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్
- ట్రంప్ విజయంతో ఎగబాకిన టెస్లా షేర్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్లు ఎగబాకాయి. కొన్ని నెలలుగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌ను ప్రభుత్వ ఎఫిషియెన్సీ కమిషన్ సారధిగా నియమిస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు.
కాగా, ఎన్నికల్లో ట్రంప్ హవా కొనసాగుతున్న క్రమంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్ లో టెస్లా షేర్లు 14 శాతం వృద్ధి చెందాయి. మరో పక్క అమెరికాలోని ఇతర ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు రివియాన్ 8 శాతం, లూసిడ్ గ్రూపు 4 శాతం, చైనా కేంద్రంగా పని చేస్తున్న ఎన్ఇఓ 5.3 శాతం నష్టపోయాయి.