మరో వారంలో ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
- నామినేటెడ్ పదవులపై తెలుగు తమ్ముళ్ల ఆశలు
- పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్న సీఎం చంద్రబాబు
- పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్న సీఎం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు చాలా మంది నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం పలు కార్పోరేషన్లకు చైర్మన్, డైరెక్టర్ నియామకాలు జరిగాయి. ఆనేక మంది నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం తాము చేసిన పనులు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న కేసుల వివరాలతో నేతలకు బయోడేటా ఇచ్చి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంపై సచివాలయంలో నేతలతో దాదాపు అయిదారు గంటలు చంద్రబాబు చర్చించారు. ఓ వారంలో పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నామినేటెడ్ పదవుల ప్రకటన చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలన్న యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం.
కూటమి సర్కార్‌లో జనసేన, బీజేపీ భాగసామ్యంగా ఉండటంతో ఆ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు కేటాయించాల్సి రావడంతో ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతోందని భావిస్తున్నారు.