భక్తి టీవీ-ఎన్టీవీ కోటి దీపోత్సవం నవంబర్ 9 నుంచే.... డోంట్ మిస్!
- ప్రతి ఏటా హైదరాబాదులో కోటి దీపోత్సవం
- అత్యంత భారీగా నిర్వహిస్తున్న ఎన్టీవీ యాజమాన్యం
- ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
కార్తీక మాసాన్ని హిందువులందరూ అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. శివ కేశవులకు సైతం అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం అని భావిస్తారు. ఇక హైదరాబాదులో కార్తీకమాసం అనగానే హిందువులందరికీ భక్తి టీవీ-ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం గుర్తుకు వస్తుంది. ఎన్టీవీ యాజమాన్యం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అత్యంత భారీగా నిర్వహిస్తుంటుంది.
హైదరాబాదులో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నవంబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా కార్తీక కోటి దీపోత్సవాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి చేతుల మీదుగా ప్రారంభమైన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్న భక్తి టీవీ-ఎన్టీవీ యాజమాన్యం ఈ ఏడాది కూడా హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది 17 రోజులపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
శివకేశవులని ఒకే వేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే ఈ కోటి దీపోత్సవం. జనంలో భక్తిభావాలను వెలికి తీసే పవిత్ర కార్యంగా ఈ కోటి దీపోత్సవంను ఎన్టీవీ-భక్తి టీవీ సంయుక్తంగా నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు తరలి వస్తుంటారు.
వారి ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రతను సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఈ మహోత్సవాన్ని కనులారా వీక్షించడం ఒక గొప్ప అదృష్టంగా భక్తులు భావిస్తుంటారు.
ప్రతిరోజు కళ్యాణ మహోత్సవం అనంతరం జరిగే ఉత్సవ విగ్రహాల ఊరేగింపునకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను చూసి భక్త కోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ఈ కోటి దీపోత్సవంలో ప్రతిరోజూ సాక్షాత్కారమవుతుంది.
నవంబర్ 9 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ వేడుకను నవంబర్ 25వ తేదీ వరకు హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.