కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం... వెబ్ సైట్ ఆవిష్కరించిన ప్రభాస్
- 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' ను లాంచ్ చేసిన ప్రభాస్
- వర్ధమాన రచయితలకు చేయూతనివ్వడమే లక్ష్యం
- ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించనున్న ది స్క్రిప్ట్ క్రాఫ్ట్
వర్ధమాన సినీ రచయితలను ప్రోత్సహించేందుకు, వారికి అవకాశాలు కల్పించేందుకు టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ ఓ వినూత్న వేదికను ఆవిష్కరించారు. ఈ వెబ్ సైట్ పేరు 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్'. ఈ వేదికపై కొత్త రచయితలు తమ ఆలోచనలను (కథలను) విస్తృతస్థాయిలో ప్రేక్షకులతో పంచుకోవచ్చు. తమ క్రియేటివిటీని ప్రదర్శించడం ద్వారా, ఔత్సాహిక రచయితలు ఎక్కువ మంది దృష్టిలో పడడానికి ఈ వేదిక సహాయపడుతుంది.
'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే... రచయితలు తమ కథలను ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆడియన్స్ ఈ మినీ కథలను చదివి తమ ఫీడ్ బ్యాక్ తెలియజేసి, రేటింగ్ ఇస్తారు.
ఇలా అత్యధిక రేటింగ్ వచ్చిన కథలకు, ఆ కథలు రాసిన రచయితలకు టాలీవుడ్ లో అసిస్టెంట్ రైటర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం 'ఇమేజిన్ యువర్ ఫేవరెట్ హీరో విత్ సూపర్ పవర్స్' పేరుతో ఓ పోటీ నిర్వహిస్తున్నారు.
రచయితలు చేయాల్సిందల్లా... ప్రకటనలో పేర్కొన్న విధంగా 3,500 పదాలతో కథను రాసి 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' కు పంపించాలి. ఈ కథల్లో ఆడియన్స్ మెచ్చిన వాటికి టాప్ రేటింగ్ లభిస్తారు. ఆ టాప్ స్టోరీస్ రాసిన రైటర్లకు తగిన అవకాశాలు కల్పించే బాధ్యతను 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' తీసుకుంటుంది.