ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం... రూ.1000 కోట్ల పెట్టుబడులు, రూ.3 వేల కోట్ల రాబడే లక్ష్యం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
- మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి పార్థసారథి
- వరల్డ్ డ్రోన్ డెస్టినేషన్ గా ఏపీ... డ్రోన్ హబ్ గా ఓర్వకల్లు
- రూ.3 వేల కోట్ల రాబడే లక్ష్యంగా చర్యలు
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం, మంత్రి పార్థసారథి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీకి రూపకల్పన చేసినట్టు తెలిపారు. డ్రోన్ రంగంలో రూ.3 వేల కోట్ల రాబడి సాధ్యమవుతుందని, 40 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రపంచ డ్రోన్ గమ్యస్థానంగా ఏపీ... డ్రోన్ హబ్ గా ఓర్వకల్లును తీర్చిదిద్దుతామని మంత్రి పార్థసారథి వివరించారు. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డి ఫెసిలిటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని... రాష్ట్రంలో 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఏపీలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలు నెలకొల్పుతామని, 25 వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇస్తామని చెప్పారు. డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యాసంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి వివరించారు.
ఇక, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఆమోదం లభించిందని వెల్లడించారు. ఈ కేబినెట్ సమావేశంలోనే ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.0ని కూడా ఆమోదించారని తెలిపారు.
డేటా సెంటర్లు అనేది అతి పెద్ద మార్కెట్ గా ఉందని... ముంబయి, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో డేటా సెంటర్లు నెలకొల్పుతున్నారని... హైదరాబాద్ కంటే భూముల విలువ చౌకగా ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి రావడంలేదని మంత్రి పేర్కొన్నారు. ఈ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు.