ఎన్నిసార్లు చెప్పాలి...? మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- చాలామంది మంత్రులకు ఇంకా సీరియస్ నెస్ రాలేదన్న చంద్రబాబు
- కొందరికి ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని విమర్శ
- కొందరు అధికారుల వల్ల ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోందని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చాలామంది మంత్రులకు ఇంకా సీరియస్ నెస్ రాలేదని... కొందరు మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని వార్నింగ్ ఇచ్చారు. మెతక వైఖరి విడనాడాలని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో విమర్శలు ఎదుర్కొన్న కొందరు అధికారులు ఇప్పటికీ తీరు మార్చుకోలేదని... అలాంటి వారి కారణంగా మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని చంద్రబాబు అన్నారు.
మరోవైపు కేబినెట్ సమావేశంలో సోషల్ మీడియాలో పోస్టులపై చర్చ జరిగింది. ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేవనెత్తారు. కొంతమంది వైసీపీ నేతలు పదేపదే పోస్టులు పెడుతున్నారని... వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా కొందరు ఎస్పీలు స్పందించడం లేదని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ కు అనుకూలంగా పని చేసిన కొందరు పోలీసు అధికారులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో ఉన్నారని చెప్పారు. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఇళ్లలో ఉన్న మహిళలపై కూడా పోస్టులు పెడుతున్నారని... అందుకే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని చెప్పారు.