ట్రంప్ హవా.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 901 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 270 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారు కావడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు కూడా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 901 పాయింట్లు లాభపడి 80,378కి ఎగబాకింది. నిఫ్టీ 270 పాయింట్లు పెరిగి 24,484కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (4.21%), ఇన్ఫోసిస్ (4.02%), టెక్ మహీంద్రా (3.85%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.71%), అదానీ పోర్ట్స్ (3.21%).

టాప్ లూజర్స్:
టైటాన్ (-1.72%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.14%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.79%), యాక్సిస్ బ్యాంక్ (-0.35%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.22%).



More Telugu News