మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ జైలు నుంచి విడుదల
- 2011లో మద్దెలచెరువు సూరి హత్య
- హత్య కేసులో కీలక నిందితుడు భానుకిరణ్
- 12 ఏళ్లుగా జైల్లోనే ఉన్న భాను
మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడైన భానుకిరణ్ హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. సూరి హత్య కేసులో భానుకిరణ్ గత 12 ఏళ్లుగా చంచల్ గూడ జైల్లోనే ఉంటున్నాడు. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కాసేపటి క్రితం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.
2011లో మద్దెలచెరువు సూరి హత్య జరిగింది. 2011 జనవరి 4న సూరిని హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్ కు 2018 డిసెంబర్ లో నాంపల్లి కోర్టు శిక్షను ఖరారు చేసింది. 12 ఏళ్ల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెరువు సూరి నిందితుడనే విషయం తెలిసిందే.