ఆ విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • మామునూరు విమానాశ్రయంపై మంత్రి సమీక్ష
  • భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మాణం ఉండాలన్న మంత్రి
  • 15 రోజులకోసారి పనుల పురోగతిపై సమీక్ష చేస్తానని వెల్లడి
వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయాన్ని త్వరతిగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన మామునూరు విమానాశ్రయంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాత్కాలిక ఏర్పాట్ల కంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిచేయాలన్నారు. ప్రతి పదిహేను రోజులకు ఓసారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు. ఈ విమానాశ్రయాన్ని ఉడాన్ పథకంతో అనుసంధానం చేసి ఇతర పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చాలన్నారు.

వరంగల్‌లో రామప్ప, భద్రకాళి, వెయ్యి స్థంబాల గుళ్లు ఉన్నాయని, వాటితో పాటు కాకతీయ కట్టడాలు, టెక్స్ టైల్ పార్క్... ఇలా వీటన్నింటి అవసరాలకు అనుగుణంగా మామునూరు విమానాశ్రయ నిర్మాణం ఉండాలన్నారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి వచ్చి విమానాశ్రయ పనులను తాను పరిశీలిస్తానన్నారు.


More Telugu News