ఆర్‌సీబీతో నా ప్రయాణం ముగిసిపోలేదు... ఫ్రాంచైజీ రిటెన్షన్స్‌పై మ్యాక్స్‌వెల్ రియాక్షన్
- 2021 నుంచి ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మ్యాక్స్‌వెల్
- ఈ స్టార్ ఆటగాడిని ఈసారి వేలంలోకి వదిలేసిన ఆర్‌సీబీ
- తనను ఫ్రాంచైజీ అట్టిపెట్టుకోకపోవడంపై స్పందించిన మ్యాక్సీ
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తో ప్రత్యేక అనుబంధం ఉంది. 2021 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్టార్ ఆటగాడిని ఈసారి ఆర్‌సీబీ వేలంలోకి వదిలేసింది. ఆర్‌సీబీ యాజమాన్యం నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే, తాజాగా తనను ఆర్‌సీబీ అట్టిపెట్టుకోకపోవడంపై మ్యాక్స్‌వెల్ స్పందించాడు. రిటెన్షన్స్ పట్ల ఫ్రాంచైజీ యాజమాన్యం తనతో మాట్లాడి అన్ని వివరించిందన్నాడు. ఈ సందర్భంగా బెంగళూరుతో తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"రిటెన్షన్స్ నేపథ్యంలో కోచ్ ఆండీ ఫ్లవర్, జట్టు డైరెక్టర్ మో బొబాట్ నాతో వీడియో కాల్‌లో మాట్లాడారు. వాళ్లు నన్ను రిటైన్ చేసుకోకపోవడంపై వివరణ ఇచ్చారు. రిటెన్షన్స్‌కు వాళ్లకు కూడా ఓ ప్రాసెస్ ఉంటుంది. అది నేను అది అర్థం చేసుకోగలను.
ఆర్సీబీతో నా జర్నీ ముగిసిందని నేను అనుకోవడం లేదు. మళ్లీ ఆ జట్టుతో భాగస్వామ్యం కావడానికి ఇష్టపడతాను. దాదాపు అరగంటపాటు నా గేమ్ గురించి, ఆర్‌సీబీ భవిష్యత్ స్ట్రాటజీ గురించి చర్చించాం. దాని పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. ఆర్‌సీబీ తరఫున ఆడడాన్ని చాలా ఎంజాయ్ చేశాను" అని ఇటీవల ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ మ్యాక్స్‌వెల్ తెలిపాడు.
అయితే, బెంగళూరు ఈసారి రూ. 83 కోట్ల భారీ మొత్తంతో వేలంలోకి వెళ్లనుంది. ఆ ఫ్రాంచైజీకి మూడు ఆర్టీఎమ్ కార్డులు సైతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మ్యాక్సీతో పాటు తమ పాత ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ఇక ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్‌తో పాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, విల్ జాక్స్ వంటి హిట్టర్లను కూడా వదిలేసిన విషయం తెలిసిందే.