నాకు రానిదల్లా భజన చేయడమే: 'జబర్దస్త్' అదిరే అభి!
- 'జబర్దస్త్' పేరు తెచ్చిందన్న అదిరే అభి
- దర్శకుడు కావాలనేదే తన కల అని వెల్లడి
- అది త్వరలో నిజం కానుందని వ్యాఖ్య
- భజన చేయడం అలవాటులేదని తేల్చి చెప్పిన అభి
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో అదిరే అభి ఒకరు. టీమ్ లీడర్ గా ఉంటూ, వివిధ రకాల కాన్సెప్ట్స్ తో ఆయన అందించే స్కిట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. అలాంటి అభి నుంచి త్వరలో 'చిరంజీవ' అనే వెబ్ సిరీస్ రానుంది. 'ఆహా' ఫ్లాట్ ఫామ్ ద్వారా డిసెంబర్ నుంచి పలకరించనుంది.
ఈ నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరే అభి మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. ఆ కలను నిజం చేసుకోవడం కోసమే నటుడిగా... రచయితగా ప్రయాణం చేశాను. అందుకోసం నేను సాఫ్ట్ వేర్ జాబ్ ను సైతం వదిలేశాను. 'జబర్దస్త్' వలన నాకు రచయితగా... నటుడిగా మంచి పేరు రావడం ఆనందాన్ని కలిగించింది" అని అన్నాడు.
"ఎవరితోనైనా చనువుగా ఉంటూ, వాళ్ల ద్వారా పనులు చేయించుకోవాలనుకోవడం... భజన చేయడం నా స్వభావానికి తగని పని. అలా చేయడం నాకు చేతకాదు. కాస్త ఆలస్యమైనా నిజాయతీగా నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటాను. నా పద్ధతిలో నాకు లభించే విజయమే నిజమైన సంతోషాన్ని ఇస్తుంది" అని చెప్పాడు.