మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

  • 2020లో వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ
  • ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి
  • సురేశ్ ను 78వ నిందితుడిగా చేర్చిన పోలీసులు
  • బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నందిగం సురేశ్
  • బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన ఆయనకు నిరాశ ఎదురయింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. 

కేసు వివరాల్లోకి వెళితే... 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో వెలగపూడికి చెందిన మరియమ్మ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. 

ఈ కేసులో నందిగం సురేశ్ ను పోలీసులు 78వ నిందితుడిగా చేర్చారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తొలుత గుంటూరు కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన అభ్యర్థనను గుంటూరు కోర్టు తిరస్కరించింది. దీంతో, ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈరోజు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.


More Telugu News