న‌టి కస్తూరిపై కేసు న‌మోదు

  • తెలుగు ప్ర‌జ‌ల‌పై న‌టి క‌స్తూరి ఇటీవ‌ల‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • తాజాగా చెన్నైలోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు న‌మోదు
  • త‌మిళ‌నాడులోని తెలుగు ప్ర‌జ‌లు ఆమెపై ఫిర్యాదు
  • వారి ఫిర్యాదు మేర‌కు నాలుగు సెక్షన్ల కింద క‌స్తూరిపై కేసు
తమిళనాడు బీజేపీ కార్య‌క‌ర్త అయిన‌ సీనియర్ న‌టి కస్తూరి తెలుగు ప్ర‌జ‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే క‌స్తూరి చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా చెన్నైలోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదైంది. త‌మిళ‌నాడులోని తెలుగు ప్ర‌జ‌లు ఆమెపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేర‌కు పోలీసులు నాలుగు సెక్షన్ల కింద క‌స్తూరిపై కేసు నమోదు చేశారు.

ఇటీవ‌ల కస్తూరి బీజేపీ సభలో మాట్లాడుతూ.. తమిళనాడులో 300 ఏళ్ల‌ క్రితం అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగువారని అన్నారు. అలా వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అని ప్ర‌గల్భాలు ప‌లుకుతున్నారని విమర్శించారు. ఇలా తెలుగు ప్ర‌జ‌ల‌పై ఆమె చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పదంగా మారాయి. దాంతో దిగొచ్చిన క‌స్తూరి.. 'మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నా మాట‌లు మీ మనసును బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను మాట్లాడిన మాటలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను' అని అన్నారు.


More Telugu News