అప్పట్లో కష్టాలన్నీ నాపై ఒకేసారి దాడి చేశాయి: నటి విజయశాంతి

  • తండ్రి చనిపోవడం గురించిన ప్రస్తావన 
  • తల్లి మరణంతో ఒంటరినయ్యానని వెల్లడి 
  • తన భర్త అండగా నిలిచాడని వ్యాఖ్య  

 నిన్నటి తరం హీరోయిన్ గా విజయశాంతి ఒక సంచలనం సృష్టించారు. స్టార్ హీరోల జోడీగా ఆడిపాడటమే కాదు, యాక్షన్ సినిమాలతో కూడా తనదైన ముద్ర వేశారు. ఒకానొక దశలో స్టార్ హీరోల సినిమాలతో సమానంగా ఆమె సినిమాలు వసూళ్లను రాబట్టాయి. అలాంటి విజయశాంతి తనకి ఎదురైన కష్టాలను గురించి ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

'దేవాలయం' సినిమా షూటింగు 'అమరావతి'లో జరుగుతోంది. తండ్రి చితికి నేను నిప్పు పెట్టే సీన్ ను చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో చెన్నైలో మా ఫాదర్ చనిపోయారు. కానీ ఆయనకి సీరియస్ గా ఉందని చెప్పి డైరెక్టర్ గారు నన్ను పంపించారు. మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఆయనను అలా చూడటం నాకు చాలా కష్టమైపోయింది. ఆ సంఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను" అన్నారు. 

"మా ఫాదర్ పోయిన ఏడాదికి మా మదర్ పోవడం నాకు తగిలిన మరో ఎదురుదెబ్బ అని చెప్పాలి. అప్పటి నుంచి నేను ఒంటరినైపోయాను. ఒక ఆడపిల్లకి తల్లిదండ్రుల సంరక్షణ చాలా అవసరం . కానీ నాకు ఆ ఇద్దరూ లేకుండా పోయారు. నాకు పెళ్లి సంబంధాలు చూసేవారుగానీ .. పెళ్లి చేసేవారుగాని లేరు. అలాంటి సమయంలో నా జీవితంలోకి నా భర్తగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. నన్ను మరింత ప్రోత్సహించి నా స్థాయి పెరిగేలా చేశారు" అని చెప్పారు. 



More Telugu News