'స్వింగ్' కింగ్ ట్రంప్.. ఏడు స్వింగ్ స్టేట్‌లలో రెండింట విజయం.. నాలుగింటిలో ముందంజ
- కీలకమై స్వింగ్ స్టేట్స్‌లో దూసుకెళ్లిన డొనాల్డ్ ట్రంప్
- నార్త్ కరోలినా, జార్జియాలో గెలుపు
- అరిజోనా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో ముందంజ
- ప్రస్తుతం ట్రంప్‌కు 247 ఎలక్టోరల్ ఓట్లు.. కమలకు 210
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అధ్యక్ష పీఠం అధిరోహించడంలో కీలకంగా వ్యవహరించే ఏడు స్వింగ్ స్టేట్స్‌లలో రెండింట రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన డెమొక్రాట్ ప్రత్యర్థి కమలా హ్యారిస్ పై విజయం సాధించారు. మరో నాలుగు రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. నార్త్ కరోలినా, జార్జియాలో గెలుపొందగా.. అరిజోనా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. కాగా, నెవాడా రాష్ట్రానికి ఇంకా ఆధిక్యం రాలేదు.
కాగా, స్వింగ్ స్టేట్స్ పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా.. మిచిగాన్ (10), జార్జియా (16), విస్కాన్సిన్ (10), నార్త్ కరోలినా (16), నెవాడా (6), అరిజోనా (11) చొప్పున ఎలక్టోరల్ ఓట్లను కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం ట్రంప్, కమల ఇద్దరూ 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మ్యాజిక్ ఫిగర్ కోసం హోరాహోరీగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, ట్రంప్ 247 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, కమల 210 వద్ద ఉన్నారు.