స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు, కమిటీల ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్
- సీఎం చైర్మన్ గా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఏర్పాటు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా స్టేట్‌ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ
- ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పెట్టబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా అడుగులు వేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
బోర్డులో ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టిజి భరత్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యులుగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు.
ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఏర్పాటైన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీలో పరిశ్రమల శాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా, ఫైనాన్స్, రెవెన్యూ, ఇరిగేషన్, పరిశ్రమలు, ఇతర బాధ్యత గల శాఖల స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రెటరీలను సభ్యులుగా నియమించారు.
SIPB.pdf
SIPC.pdf