ఓటీటీకి వచ్చిన మలయాళ రొమాంటిక్ కామెడీ!

  • మలయాళ మూవీగా 'వివేకానందన్ విరళను'
  • ఒక హీరో .. ఐదుగురు హీరోయిన్స్ చేసే సందడి  
  • షైన్ టామ్ చాకో కెరియర్లో వందో సినిమా 
  • పది నెలలకి ఓటీటీకి వచ్చిన కంటెంట్
  • త్వరలో తెలుగులోనూ అందుబాటులోకి

ఈ ఏడాది ఆరంభంలో మలయాళంలో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చింది. ఆ సినిమా పేరే 'వివేకానందన్ విరళను'. కమల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, బిజిబల్ సంగీతాన్ని అందించాడు. షైన్ టామ్ చాకో .. స్వాసిక విజయ్ .. గ్రెస్ ఆంటోని .. మెరీనా ప్రధానమైన పాత్రలను పోషించారు. జనవరి 19న థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. 

నెల తిరగ్గానే ఈ సినిమా ఓటీటీకి వచ్చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. ముఖ్యంగా షైన్ టామ్ చాకో నటనను ఇష్టపడే అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. కానీ కొన్ని కారణాల వలన, 10 నెలలకి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అడుగుపెట్టింది. షైన్ టామ్ చాకో చేసిన వందో సినిమా ఇది. అలా ఆ వైపు నుంచి ప్రత్యేకతను సంతరించుకున్న సినిమా ఇది. 

వివేకానందన్ తన జాబ్ నిమిత్తం భార్యకు దూరంగా వేరే ఊళ్లో ఉండవలసి వస్తుంది. అసలే అతను విలాస పురుషుడు .. శృంగార పురుషుడు. అందువలన ఒకరికి తెలియకుండా ఒకరితో ఆలా ఐదుగురు యువతులతో రహస్య సంబంధాలను కొనసాగిస్తూ ఉంటాడు. ఒక రోజున అతనికి సంబంధించిన ఒక వీడియో బయటికి వస్తుంది. అప్పుడు ఆ ఐదుగురు యువతులు కలిసి ఏం చేస్తారనేది కథ. త్వరలో తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. 



More Telugu News