అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలో ట్రంప్.. మరో 31 ఎలక్టోరల్ ఓట్లు గెల్చుకుంటే వైట్ హౌస్ లోకి ఎంట్రీ
- 24 రాష్ట్రాల్లో రిపబ్లికన్ల గెలుపు
- స్వింగ్ స్టేట్స్ ఏడింటిలో ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ హవా
- కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలో లీడ్ లో మాజీ అధ్యక్షుడు
- 239 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్న ట్రంప్.. 179 ఎలక్టోరల్ ఓట్లతో కమలా హ్యారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం అధ్యక్ష పీఠానికి మరో 31 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 24 రాష్ట్రాలను రిపబ్లికన్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ రాష్ట్రాలలో మొత్తం 239 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అధ్యక్ష రేసులో గెలుపొందాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ 239 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. స్వింగ్ స్టేట్లలో లీడ్ లో ఉండడంతో ట్రంప్ గెలుపు లాంఛనమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏడు స్వింగ్ స్టేట్లలో ట్రంప్ ఇప్పటికే జార్జియాను గెలుచుకున్నారు. వీటిలోనూ అత్యంత కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలో ట్రంప్ లీడ్ లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో గెలిచిన అభ్యర్థి పార్టీనే అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంది. గడిచిన పన్నెండు అధ్యక్ష ఎన్నికల్లో పది ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో గెలిచిన పార్టీనే అమెరికాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కేవలం 179 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే ఇప్పటి వరకు గెలుచుకోగలిగారు.
రిపబ్లికన్లు గెలుచుకున్న రాష్ట్రాలు..
కెంటకీ, ఇండియానా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఒక్లహోమా, మిస్సోరి, టెక్సస్, జార్జియా, ఇడాహో, నార్త్ కరోలినా, నార్త్ డకోటా, అయోవా, సౌత్ డకోటా, లూసియానా, ఓహియో, వయోమింగ్, నెబ్రస్కా, టెనెస్సీ, అలబామా, మిసిసిపి, వెస్ట్ వర్జీనియా, అర్కన్సాస్, మోంటానా, యుటా