తెలంగాణ‌లోని మ‌ద్యం ప్రియుల‌కు భారీ షాక్‌

  • రాష్ట్రంలో లిక్క‌ర్ ధ‌ర‌ల పెంపుపై ప్ర‌తిపాద‌న‌లు
  • ప‌క్క రాష్ట్రాల్లో ఉన్న రేట్ల‌కు అనుగుణంగా మార్పుల‌కు క‌స‌ర‌త్తు
  • బీరుపై రూ. 15-20, క్వార్ట‌ర్‌పై బ్రాండ్‌ను బ‌ట్టి రూ. 10-80 వ‌ర‌కు పెంచే యోచ‌న‌
తెలంగాణ‌లోని మ‌ద్యం ప్రియుల‌కు త్వ‌ర‌లో బిగ్ షాక్ త‌గిలే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. రాష్ట్రంలో లిక్క‌ర్ ధ‌ర‌ల పెంపుపై ప్ర‌తిపాద‌న‌లు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప‌క్క రాష్ట్రాల్లో ఉన్న రేట్ల‌కు అనుగుణంగా మార్పుల‌కు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. 

బీరుపై రూ. 15 నుంచి రూ. 20, క్వార్ట‌ర్‌పై బ్రాండ్‌ను బ‌ట్టి రూ. 10 నుంచి రూ. 80 వ‌ర‌కు పెంచే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నిర్ణ‌యంతో స‌గ‌టున 20 నుంచి 25 శాతం వ‌రకు ధ‌ర‌లు పెంచి నెలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 700 కోట్ల మేర అద‌న‌పు ఆదాయం స‌మకూర్చుకోవాల‌ని స‌ర్కార్ చూస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, మ‌ద్యం ధ‌ర‌ల పెంపుపై ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. 


More Telugu News