దూసుకెళుతున్న ట్రంప్‌.. 21 రాష్ట్రాల్లో పాగా.. క‌మ‌ల వెనుకంజ‌

  • 21 రాష్ట్రాల్లో గెలిచిన‌ ట్రంప్‌నకు 210 ఎలక్టోరల్ ఓట్లు
  • 11 రాష్ట్రాల్లో గెలుపొందిన కమల‌కు 112 ఎలక్టోరల్ ఓట్లు
  • మొత్తం 535 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌కు గాను 270 ఎల‌క్టోర‌ల్ ఓట్లు సాధించిన అభ్య‌ర్థికి అధ్య‌క్ష‌పీఠం
అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థి, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. ట్రంప్ ఇప్పటికే టెక్సాస్, ఫ్లోరిడా సహా 21 రాష్ట్రాలలో విజ‌యం సాధించారు. త‌ద్వారా ఆయ‌న ఖాతాలో 210 ఎలక్టోరల్ ఓట్లు చేరాయి. మ‌రోవైపు డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థి, ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్ 11 రాష్ట్రాల్లో గెలుపొంది 112 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. 

మొత్తం 535 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌కు గాను 270 ఎల‌క్టోర‌ల్ ఓట్లు సాధించిన అభ్య‌ర్థి అధ్య‌క్ష‌పీఠం అధిరోహిస్తారు. అయితే, స్వింగ్ స్టేట్స్ అయిన‌ అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ త‌దిత‌ర రాష్ట్రాల‌ ఫ‌లితాల‌పై అధ్య‌క్ష అభ్య‌ర్థి భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. 

ఈ రాష్ట్రాల్లో మెజారిటీ సాధించిన వారికే అధ్య‌క్ష‌పీఠం ద‌క్కే అవ‌కాశం ఉంటుంది. ఇందులో జార్జియాలో ట్రంప్‌, పెన్సిల్వేనియాలో క‌మ‌ల ముందంజలో ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా, ఆ దేశంలోని 50 రాష్ట్రాల్లో 40 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం పోలింగ్‌ ముగిసిన‌ట్లు తెలుస్తోంది.


More Telugu News