ప్రయాణికులకు గూగుల్ వ్యాలెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన హైదరాబాద్ మెట్రో
- రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ సాంకేతికతతో వ్యాలెట్ సేవలు
- ప్రయాణికులు క్యూలైన్‌లో పడిగాపులు పడకుండా టికెట్ల కొనుగోలుకు గూగుల్ వ్యాలెట్
- గూగుల్ వ్యాలెట్‌ను ప్రారంభించిన మెట్రో రైలు ఎండీ ఎస్వీఎస్ రెడ్డి
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ప్రయాణికులు టికెట్ కొనుగోలు కోసం క్యూలైన్‌లో ప్రయాస పడాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు సులభతరంగా మెట్రో టికెట్లను గూగుల్ వ్యాలెట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. గూగుల్ వ్యాలెట్‌ను మెట్రో రైలు ఎండీ ఎస్వీఎస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్ డేట్ చేసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికులు మరింత సులభతరంగా మెట్రో టికెట్లు బుక్ చేసుకునేందుకు రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన వ్యాలెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
హైదరాబాద్ నగర వాసులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఎన్నో మార్పులు తీసుకువస్తూనే ఉన్నామని చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మెట్రో రైలు విస్తరణ వల్ల హైదరాబాద్ నలుమూలల ఉన్న ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.