ఐపీఎల్‌ 2025 మెగా వేలం.. పేరు న‌మోదు చేసుకున్న 1,574 మంది ప్లేయ‌ర్లు!

  • ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం
  • 1,574 మందిలో 1,165 మంది భారత ఆట‌గాళ్లు, 409 మంది విదేశీ ప్లేయ‌ర్లు
  • ఈ జాబితాలో 1,224 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 320 క్యాప్డ్ ప్లేయ‌ర్లు, 30 మంది అసోసియేట్ దేశాల క్రికెటర్లు  
  • అత్య‌ధికంగా దక్షిణాఫ్రికా నుంచి 91 మంది క్రికెటర్ల పేర్ల న‌మోదు 
  • ప్ర‌స్తుతం కేవ‌లం 204 స్లాట్‌లు మాత్రమే ఖాళీ
ఇటీవ‌ల రిటెన్ష‌న్ ప్ర‌క్రియ ముగియ‌డంతో ఇప్పుడు అంద‌రూ ఐపీఎల్‌ 2025 మెగా వేలం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ వేలం ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. దీని కోసం తాజాగా మొత్తం 1,574 మంది ఆటగాళ్లు త‌మ పేర్లు నమోదు చేసుకున్నారు. 

ఇందులో 1,165 మంది భారత ఆట‌గాళ్లు ఉంటే..  409 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు. అలాగే ఈ జాబితాలో 1,224 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 320 క్యాప్డ్ ప్లేయ‌ర్లు, మ‌రో 30 మంది అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. 

ఇక ఈ జాబితాలో విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా నుంచి అత్య‌ధికంగా 91 మంది క్రికెటర్లు త‌మ పేర్లు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం విశేషం. ఆ త‌ర్వాత 76 మంది ఆట‌గాళ్ల‌తో ఆస్ట్రేలియా రెండు స్థానంలో ఉంది. అలాగే ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ల నుంచి వరుసగా 52, 29 మంది ఆటగాళ్లు ఉంటే.. న్యూజిలాండ్ నుంచి 39 మంది, విండీస్ నుంచి 33 మంది ప్లేయ‌ర్లు వేలం కోసం త‌మ పేర్లు న‌మోదు చేసుకున్నారు. 

కాగా, ప్ర‌స్తుతం కేవ‌లం 204 స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. దీంతో వేలంలో 1,574 మంది ఆటగాళ్ల జాబితా నుంచి 204 మందిని మాత్ర‌మే తీసుకునే అవ‌కాశం ఉంది. ఇక ప్ర‌తి జ‌ట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉంటారు.

ఐపీఎల్ 2025 వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్న దేశాల‌వారీగా ఆటగాళ్ల జాబితా
దక్షిణాఫ్రికా- 91
ఆస్ట్రేలియా- 76
ఇంగ్లండ్- 52
న్యూజిలాండ్- 39
వెస్టిండీస్-33
ఆఫ్ఘనిస్తాన్- 29
శ్రీలంక- 29
బంగ్లాదేశ్- 13
నెదర్లాండ్స్- 12
అమెరికా-10
ఐర్లాండ్- 9
జింబాబ్వే- 8
కెనడా- 4
స్కాట్లాండ్- 2
ఇటలీ- 1
యూఏఈ- 1


More Telugu News