తల్లికి కుమారుడు కాకుండా పోతాడా? కొడుక్కి అమ్మకాకుండా పోతుందా?: వైఎస్ విజయమ్మ
- కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజమే అన్న విజయమ్మ
- తమ ఫ్యామిలీపై నెట్టింట చేస్తున్న దుష్ప్రచారం బాధ కలిగిస్తోందని వ్యాఖ్య
- తమను అడ్డం పెట్టుకుని రాజకీయాల కోసం ఇంతగా దిగజారుతారా? అంటూ ఆగ్రహం
"కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజమే. అంత మాత్రాన ఆ తల్లికి కుమారుడు కాకుండా పోతాడా? కొడుక్కి అమ్మకాకుండా పోతుందా? ఓ అన్నకు చెల్లి కాకుండా పోతుందా? చెల్లికి అన్నకాకుండా పోతాడా?" అని వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మా పిల్లల్ని చాలా సంస్కారవంతంగా పెంచాం. మా కుటుంబంపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం చాలా బాధ కలిగిస్తోంది. షర్మిల నా కూతురే కాదంటున్నారు. నా మనవల దగ్గరకు వెళితే అదో కథ. రెండేళ్ల క్రితం జరిగిన నా కారు ప్రమాదానికి నా కుమారుడు జగన్‌కు ముడిపెడుతున్నారు. మమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ఇంతగా దిగజారుతారా?" అని విజయమ్మ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె మంగళవారం వీడియో సందేశాన్ని విడుదల చేశారు.