పోలీసుల అదుపులో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి
- గతంలో కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు
- రవీందర్ రెడ్డిని పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కడప పీఎస్ కు తరలింపు
నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీందర్ రెడ్డి స్వస్థలం పులివెందుల. అతడు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడని తెలుస్తోంది. వర్రా రవీందర్ రెడ్డిని పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప పీఎస్ కు తీసుకువచ్చారు.
వర్రా రవీందర్ రెడ్డి గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితపై అసభ్యకర పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. అంతేకాదు, షర్మిల, విజయమ్మపైనా అతడు అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం కూడా వెల్లడైంది. రవీందర్ రెడ్డిపై పులివెందుల, మంగళగిరి, హైదరాబాదులో పలు కేసులు ఉన్నాయి.
కాగా, రవీందర్ రెడ్డి... వైఎస్ భారతి రెడ్డి పీఏ అని గతంలో ప్రచారం జరిగింది.