అర్చకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

  • అర్చకుల కనీసం వేతనం పెంపు
  • రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసే అర్చకులకు వర్తింపు
  • కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని సీఎం చెప్పారన్న మంత్రి ఆనం 
ఏపీ సర్కారు రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు తియ్యని కబురు చెప్పింది. రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనం పెంపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. 

అర్చకులకు కనీసం వేతనం రూ.15 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని ఆనం వివరించారు. తమ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 3,203 మంది అర్చకులకు లబ్ధి కలగనుందని తెలిపారు. అర్చకుల వేతనాల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.10 కోట్ల మేర భారం పడనుందని అన్నారు. ఇందులో కొంత మొత్తం సీజీఎఫ్ నిధుల నుంచి చెల్లించాలని నిర్ణయించామని వెల్లడించారు. 

ఇక... వేదపండితులు, వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి ద్వారా లబ్ధి చేకూరనుందని ఆనం వివరించారు.


More Telugu News