మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటు: మంత్రి నారా లోకేశ్
- ఇంటర్ విద్యపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష
- ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండాలన్న మంత్రి
- ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచన
- పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డిఎస్సీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు
ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటునకు ప్రణాళికలు రూపొందించాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ నారా లోకేశ్ నేడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో ఇంటర్ విద్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివి ఐఐటీ, మెడిసిన్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలను దినపత్రికల్లో ప్రచురించేలా కసరత్తు చేయాలన్నారు.
రిమోట్ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే వారికి త్వరితగతిన అనుమతులు అందించాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం వల్ల 15 వేల వరకు అడ్మిషన్లు పెరిగాయనే విషయాన్ని అధికారులు మంత్రికి వివరించారు. వచ్చే ఏడాది 2 లక్షల వరకు అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
జూనియర్ కాలేజీల్లో పనివేళలు పెంచడంతో పాటు విద్యార్థుల హాజరుపై సమీక్ష, ప్రోగ్రెస్ కార్డులను అందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఉత్తమ అధ్యాపకులతో విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులకు శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా నారా లోకేశ్ సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎన్ సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టడంతో పాటు ప్రశ్నాపత్రంలోనూ మార్పులు చేయనున్నట్లు తెలిపారు.
పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డిఎస్సీకి ఏర్పాట్లు చేయండి
రాష్ట్రంలో టెట్ -2024 విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో మెగా డీఎస్సీ పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పై మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. సాధ్యమైనంత ఎక్కువమంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.
రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు ఈనెల 11వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తిచేయాలని అన్నారు.