రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడమే మా కర్తవ్యం: రేవంత్ రెడ్డి

  • కులగణన సర్వేను తమ ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్న సీఎం
  • కులగణనను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలనేది రాహుల్ ఆలోచన అని వెల్లడి
  • 2025 జనగణనలో ఈ కులగణనను పరిగణలోకి తీసుకోవాలన్న సీఎం
మనది రైజింగ్ తెలంగాణ... కాబట్టి దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బోయినపల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కులగణన సర్వేను ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు.

కులగణనపై తమ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే ప్రథమ కర్తవ్యమన్నారు. కులగణనను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలనేది రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. కులగణనను త్వరితగతిన పూర్తి చేసి బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లను అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కులగణనను 2025 జనగణనలో పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఈ వేదిక పైనే తీర్మానం చేస్తున్నామన్నారు. 

కులగణనపై పౌర సమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ హైదరాబాద్ రావడం గొప్ప విషయమన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనకు కులగణన సర్వే కీలకమన్నారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు.


More Telugu News