రాహుల్ గాంధీకి దమ్ముంటే ఇప్పుడు తెలంగాణ యాత్ర చేయాలి: బండి సంజయ్
- హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్
- ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఎన్నో హామీలు ఇచ్చారన్న సంజయ్
- రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ఉందన్న బండి సంజయ్
- హామీలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందన్న బీజేపీ ఎంపీ
గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని... ఆయనకు దమ్ముంటే ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ యాత్ర చేయాలని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాకే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు.
హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి మరీ యువతకు రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు.
వాటిని అమలు చేయకుండా ఈ రోజు తెలంగాణకు వస్తున్నారని... అందుకే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ నేతలు అయినా... ఈ దేశంలో తిరిగే హక్కు ఉందని... కానీ హామీలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా రాహుల్ గాంధీపై ఉందన్నారు.