బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి ఆఫర్ అదుర్స్.. జియో, ఎయిర్‌టెల్‌లకు గట్టి షాక్!
- రూ.1,899తో కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్
- ప్లాన్ గడువు 365 రోజులు.. 600 జీబీ డేటా
- 365 రోజుల పాటు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు
- ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు చెల్లుబాటు
పండుగల సీజన్ సందర్భంగా ప్రైవేటు టెలికాం సంస్థలు సబ్ స్క్రైబర్లకు దీపావళి సందర్భంగా ఆఫర్స్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దీపావళి సందర్భంగా యూజర్లకు సరికొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్ పండుగ తర్వాత కూడా చెల్లుబాటు కానుంది. జియో దీపావళి ఆఫర్‌తో పోలిస్తే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి ఆఫర్..
బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి ఆఫర్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ సమయంలో వినియోగదారులు రూ.1,999 రీచార్జ్ ప్లాన్‌పై రూ.100 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంటే ఈ ప్లాన్‌కు రూ.1,899 చెల్లిస్తే సరిపోతుంది.
ఇక ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు 600 జీబీ డేటాను పొందుతారు. 365 రోజుల పాటు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్ కూడా వస్తాయి. ఈ ఆఫర్‌ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. దీపావళి స్పెషల్ ఆఫర్‌లో రూ.1,999 రీచార్జ్ వోచర్‌పై రూ.100 తగ్గింపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఏడాది పాటు 600 జీబీ డేటా, అపరిమిత కాల్స్, గేమ్స్, మ్యూజిక్ సైతం ఆస్వాదించ వచ్చని తెలిపింది.
ఇక జులైలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) భారీగా తమ టారిఫ్‌లను పెంచిన తర్వాత చాలా మంది సబ్‌స్క్రైబర్‌లు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు భారీగానే సబ్‌స్క్రైబర్‌లు వెళ్తండటం గమనార్హం.