సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. ఈసారి సల్లూభాయ్‌కి రెండు ఆప్షన్స్ ఇచ్చిన ఆగంతుకులు!
- ముంబయి ట్రాఫిక్ పోలీసులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట సందేశం
- సల్మాన్ క్షమాపణ చెప్పాలి లేదా రూ. 5 కోట్లు చెల్లించాలని డిమాండ్
- అలా చేయకుంటే చంపేస్తామని బెదిరింపులు
- వారం వ్యవధిలో సల్మాన్ ఖాన్‌కు ఇది రెండో బెదిరింపు సందేశం
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. కృష్ణ జింకల వేట విషయమై గతకొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుసగా బెదిరింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా సల్లూభాయ్‌కి ఇదే కోవలో మరో బెదిరింపు సందేశం వచ్చినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.
అయితే, ఈసారి సల్మాన్‌కు ఆగంతుకులు రెండు ఆప్షన్స్ ఇచ్చినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ప్రాణాలతో ఉండాలంటే క్షమాపణ చెప్పాలి లేదా రూ. 5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, వారం వ్యవధిలో సల్మాన్ ఖాన్‌కు ఇది రెండో హత్య బెదిరింపు సందేశం కావడం గమనార్హం.
ముంబయి పోలీసు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గత రాత్రి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో వాట్సప్‌లో బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు పేరిట ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిపాయి. "సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. అలా చేయకుంటే చంపేస్తాం. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది" అని ట్రాఫిక్ కంట్రోల్ రూంకు సందేశం వచ్చినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఈ సందేశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గత నెల 30న కూడా ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఇదే విధమైన బెదిరింపు సందేశం వచ్చింది. అప్పుడు ఆగంతతుకులు రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.