మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం

  • ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ 
  • ఆయ‌న నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమన్న చంద్ర‌బాబు
  • మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారంటూ ప్ర‌శంస‌
  • ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి
మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ (99) క‌న్నుమూశారు. వ‌య‌సురీత్యా వ‌చ్చిన అనారోగ్య కార‌ణాల‌తో ఆయ‌న అన‌కాప‌ల్లి జిల్లా చీడికాడ మండ‌లం పెద‌గోగాడ‌లో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున‌ ఆయ‌న వ‌రుస‌గా 1983, 1985, 1989, 1994, 1999లో ఐదుసార్లు గెలిచారు. ఎన్‌టీఆర్ హయాంలో మంత్రిగా ప‌ని చేశారు.   

ఆయ‌న‌ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి బాధాక‌ర‌మ‌న్నారు. ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. 

మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశార‌న్నారు. నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ మృతి తీవ్ర విచారం కలిగించిందని తెలిపారు. మంత్రిగా పని చేసి పదవికి వన్నె తెచ్చారన్నారు. ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


More Telugu News