కెనడా ఆలయంలో హిందువులపై దాడి.. ఆందోళన వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- బ్రాంప్టన్‌లోని ఆలయంలో హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి
- తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు
- ఈ ఘటన వేదన, ఆందోళన రెండింటినీ రేకెత్తించిందన్న పవన్
- కెనడా ప్రభుత్వం అక్కడి హిందూ సమాజానికి సురక్షితమైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ ఆలయంలో భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఇప్పటికే ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ సమాజానికి సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కెనడాలో దాడులు, పొరుగు దేశాలలో హిందువులను వేధించడంపై ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్ వంటి దేశాలలో మన హిందూ సోదరులు, సోదరీమణులు వేధింపులు, హింస, ఊహాతీతమైన బాధలకు గురికావడం చాలా బాధ కలిగించింది. హిందువులు గ్లోబల్ మైనారిటీ. అందుకే వారు చాలా సులువుగా టార్గెట్ అవుతున్నారు. వారిపై ఈజీగా దాడులకు పాల్పడుతున్నారు.
కెనడాలోని హిందూ ఆలయంపై, హిందువులపై జరిగిన దాడి హృదయాన్ని తాకింది. ఇది వేదన, ఆందోళన రెండింటినీ రేకెత్తించింది. కెనడా ప్రభుత్వం అక్కడ హిందూ సమాజానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తక్షణ, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా. వివిధ దేశాలలో హిందువులపై హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయినప్పటికీ ప్రపంచ నాయకులు, అంతర్జాతీయ సంస్థలు, శాంతిని కోరుకునే ఎన్‌జీఓల నుంచి మౌనమే సమాధానం అవుతుంది. హిందువులకు సంఘీభావం ఎక్కడిది? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాం. ఎక్కడైనా, ఏ సంఘమైనా హింసకు గురికాకుండా, అచంచలమైన సంకల్పంతో ఐక్యంగా నిలబడదాం” అని జనసేనాని తన పోస్టులో పేర్కొన్నారు.