సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్.కృష్ణయ్య

  • బీసీ రిజర్వేషన్లపై కమిషన్ ఏర్పాటు
  • కృష్ణయ్య, దానం నాగేందర్ ఆధ్వర్యంలో సీఎంను కలిసిన బీసీ సంఘాల నేతలు
  • ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాల నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బీసీ సంఘాల నేతలు కలిశారు. మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పలువురు బీసీ సంఘాల నేతలు సీఎంను కలిశారు. ముఖ్యమంత్రికి వారు శాలువా కప్పి సన్మానించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం తదితరులతో సీఎం నిన్న రాత్రి సమావేశమయ్యారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


More Telugu News