ఐపీఎల్ త‌ర‌హాలోనే ఏపీఎల్: ఎంపీ కేశినేని చిన్ని

  • గ్రామీణ క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు ఐపీఎల్ త‌ర‌హాలో ఏపీఎల్ అన్న ఎంపీ
  • గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ ఆట‌గాళ్ల వెలికితీత‌కు కృషి చేస్తున్న‌ట్లు వెల్ల‌డి
  • అతి త్వ‌ర‌లో అందుబాటులోకి మూల‌పాడు క్రికెట్ స్టేడియంలోని రెండో గ్రౌండ్
  • మూల‌పాడుకు అన్నీ అనుకూలిస్తే గోల్ఫ్ కోర్స్ కూడా వ‌స్తుంద‌న్న కేశినేని చిన్ని
గ్రామీణ క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు ఐపీఎల్ త‌ర‌హాలో ఏపీఎల్ నిర్వ‌హిస్తామ‌ని విజ‌య‌వాడ‌ ఎంపీ కేశినేని చిన్ని (శివ‌నాథ్‌) అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ ఆట‌గాళ్ల వెలికితీత‌కు కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు. అతి త్వ‌ర‌లో మూల‌పాడు క్రికెట్ స్టేడియంలోని రెండో గ్రౌండ్ అందుబాటులోకి వ‌స్తుందని తెలిపారు. 

మూల‌పాడులో సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్ నిర్మాణానికి ప్ర‌ణాళిక సిద్ధం చేశామ‌న్నారు. ఇక్క‌డి మైదానాన్ని సంద‌ర్శించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఏసీఏ త‌రఫున మూల‌పాడులో ఏడాదిలోపు క్రికెట్ అకాడ‌మీ వ‌స్తుంద‌ని చెప్పారు. మూల‌పాడుకు అన్నీ అనుకూలిస్తే గోల్ఫ్ కోర్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. 

రాజ‌ధాని ప్రాంతంలో మూల‌పాడు, మంగ‌ళ‌గిరిలో రెండు క్రికెట్ స్టేడియాలు ఉండ‌టం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ రెండు స్టేడియాల‌ను ఏడాదిలోపు అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.   


More Telugu News