శోభన్ బాబుగారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారని ఫ్యాన్స్ నా చేతిని ముద్దాడారు!: వంశీ రామరాజు
- శోభన్ బాబు తన అభిమాన నటుడన్న వంశీ రామరాజు
- ఆయనకి అభిమానుల పట్ల ప్రేమ ఎక్కువని వెల్లడి
- ఆయన కోసం 6 నెలలు తిరిగానన్న వంశీ రామరాజు
- అప్పట్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదని వ్యాఖ్య
రచయిత .. దర్శకుడు వంశీ రామరాజు, 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. శోభన్ బాబుతో తనకి పరిచయం పెరిగిన సంఘటనలను గురించి వివరించారు. నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు 'మైనర్ బాబు' షూటింగుకి రెగ్యులర్ గా వెళుతూ ఉండేవాడిని. శోభన్ బాబుగారితో మాట్లాడినప్పుడు, తన సినిమాలలో తన నటనకి సంబంధించిన విమర్శలు చెప్పమనేవారు. అదే ఆయన గొప్పతనమని నాకు అనిపించింది" అని అన్నారు.
"ఆ రోజుల్లోనే నేను 'వంశీ' సంస్థను స్థాపించాను. ఆ సంస్థ జ్యోతి ప్రజ్వలన శోభన్ బాబు గారిని చేయవలసిందిగా కోరాను. తాను ఎప్పుడూ ఏ సంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్లలేదనీ, తనని ఇబ్బంది పెట్టొద్దని ఆయన అన్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా నేను ఆయన చుట్టూ 6 మాసాలు తిరిగాను. చివరికి ఆయన ఒప్పుకున్నారు. హైదరాబాద్ - రవీంద్ర భారతిలోనే ఆ కార్యక్రమం జరిగింది" అని చెప్పారు.
" శోభన్ బాబు గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన కారు ఎక్కుతూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది చూసిన ఆయన అభిమానులు పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిని ముద్దాడారు. అంతగా ఆయనను అభిమానించేవారు. అభిమానుల పట్ల శోభన్ బాబుగారికి నిజమైన ప్రేమాభిమానాలు ఉండేవి. తన అభిమానులు బాగా చదువుకోవాలనీ .. ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆయన కోరుకునేవారు" అని అన్నారు.