హైదరాబాద్ లో కోటి దీపోత్సవం.. ఎప్పటి నుంచంటే!

  • ఈ నెల 9 నుంచి 25 వరకు ఎన్టీవీ- భక్తి టీవీల ఆధ్వర్యంలో నిర్వహణ
  • ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో రోజూ సాయంత్రం దీపోత్సవం
  • చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
ఏటా కార్తీక మాసంలో హైదరాబాద్ లో జరిగే కోటి దీపోత్సవ మహాయజ్ఞం ఈ నెల 9న ప్రారంభం కానుంది. నగరంలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ప్రతీ రోజు సాయంత్రం 5.30 గంటలకు నవంబర్‌ 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఎన్టీవీ-భక్తి టీవీ యాజమాన్యం ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

దీపపు కాంతులు, వేద పండితులు, స్వామీజీల ప్రవచనామృతాలు, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కల్యాణాలు, లింగోద్భవం, కల్యాణ కమనీయాలతో రోజుకో ప్రత్యేక కార్యక్రమంతో వీక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది. ఏటా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. 

శివకేశవులని ఒకే వేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం అని చెప్పారు. ఈ దీపయజ్ఞంలో వివిధ పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనాలు చెబుతారని తెలిపారు.


More Telugu News