డొనాల్డ్ ట్రంప్ కోసం ఢిల్లీలో ప్రముఖ స్వామిజీ హోమం.. ఎందుకంటే..!
- ట్రంప్ విజయం కోసం మహామండలేశ్వర్ స్వామి వేదమూర్తీనంద్ సరస్వతి హోమం
- ఆయన విక్టరీ ప్రపంచశాంతికి ఉపయోగపడుతుందన్న స్వామి
- ట్రంప్ హిందూబంధువు కాబట్టే హోమం చేశానని వ్యాఖ్య
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష పోలింగ్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి కమల హ్యారిస్ మధ్య ఈసారి హోరాహోరీ పోరు ఉంటుందని సర్వేలు తేల్చేశాయి. దీంతో అగ్రరాజ్యానికి తదుపరి అధ్యక్షుడు ఎవరు అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇదిలాఉంటే.. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం ఢిల్లీలో ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. మహామండలేశ్వర్ స్వామి వేదమూర్తీనంద్ సరస్వతి ఆధ్వర్యంలో వీటిని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వేదమూర్తీనంద్ సరస్వతి మాట్లాడుతూ ట్రంప్ విజయం ప్రపంచానికి చాలా అవసరం అన్నారు. ప్రపంచశాంతికి ఆయన విక్టరీ తోడ్పడుతుందని స్వామి పేర్కొన్నారు.
"రోజురోజుకూ ప్రపంచమంతటా భయంకర వాతావరణం పెరుగుతోంది. ఆర్థికవృద్ధి నేలచూపులు చూస్తోంది. మానవాళి సంరక్షుడు ట్రంప్ మాత్రమే. ప్రపంచంలో శాంతిని ఆయన మాత్రమే తేగలరు. బంగ్లాదేశ్‌తో పాటు ఇతర దేశాల్లో హిందువులపై దాడులను ఖండించింది ఆయనొక్కరే. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జరగలేదు. ప్రస్తుతం అంతటా అశాంతి నెలకొంది. ఆయన హిందూబంధువు కాబట్టే హోమం చేశాను" అని స్వామి వేదమూర్తీనంద్ సరస్వతి చెప్పుకొచ్చారు.