స్మోకింగ్ అలవాటుపై బాలీవుడ్ దిగ్గజం షారుఖ్ ఖాన్ కీలక ప్రకటన
- ఇకపై ధూమపానం చేయబోనని ప్రకటన
- 59వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల మధ్య వెల్లడి
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
‘బాలీవుడ్ బాద్‌షా’ షారుఖ్ ఖాన్ ఈ శనివారం (నవంబర్ 2) 59వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. తన అభిమానులు బాంద్రాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొని మాట్లాడాడు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశాడు. ఇకపై స్మోకింగ్ చేయబోనని షారుఖ్ ఖాన్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘మీతో పంచుకునేందుకు ఒక మంచి విషయం ఉంది. అబ్బాయిలూ.. ఇకపై నేను స్మోకింగ్ చేయను. ఈ అలవాటు మానేసిన తర్వాత ఊపిరి పీల్చుకోలేనేమో అనిపిస్తోంది. కానీ అల్లాహ్ దయతో అది సమసిపోతుంది’’ అని షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించాడు.
పిల్లల నుంచి నేర్చుకున్న పాఠం ఏమిటని ఒక అభిమాని ప్రశ్నించగా.. తన పుట్టిన రోజు ఉదయం ఇంట్లో ఏం జరిగిందో షారుఖ్ పంచుకున్నాడు. ‘‘నిన్న రాత్రి ఒక డిన్నర్ ఉండడంతో ఈరోజు ఉదయం నేను ఆలస్యంగా మేల్కొన్నాను. నిద్రలేచిన తర్వాత పిల్లలతో కాసేపు గడిపేందుకు చిన్న కొడుకు దగ్గరికి వెళ్లాను. వాడి సమస్యలు వాడికున్నాయి. ఐ-ప్యాడ్ పని చేయడం లేదట. ఆ తర్వాత నా కూతురి దగ్గరకు వెళ్లాను. ఆమెకు ఒక సమస్య ఉంది. దుస్తులు మంచిగా లేవట. ఆ తర్వాత నా పెద్ద కొడుకు.. ఇక చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ షారుఖ్ ఖాన్ సరదాగా చెప్పుకొచ్చాడు.
కాగా షారుఖ్ ఖాన్ ఒకానొక సమయంలో చైన్ స్మోకింగ్ చేశాడు. అయితే ఆ అలవాటును ఇదివరకే మానుకున్నానని తెలిపాడు. 2012లో ఐపీఎల్‌లో తన ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో షారుఖ్ ఖాన్ బహిరంగంగానే స్మోకింగ్ చేశాడు. దీనిపై కేసు నమోదయింది. దీంతో జైపూర్‌లోని ఓ కోర్టు ముందు నేరాన్ని అంగీకరించడంతో కోర్ట్ రూ.100 స్వల్ప జరిమానా విధించింది.