ఈసారి మంత్రి పొంగులేటిని టార్గెట్ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- తెలంగాణకు కొత్త సీఎం వస్తారని ఇటీవల వ్యాఖ్యానించిన ఏలేటి
- తాజాగా, పొంగులేటికి పదవీగండం ఉందంటూ జోస్యం
- ఈడీ దాడుల కారణంగా పదవిని కోల్పోతారని వెల్లడి
ఇటీవల తెలంగాణ సీఎం పదవి మార్పు ఉంటుందని, కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు కొత్త సీఎంను నియమిస్తుందని వ్యాఖ్యానించి దుమారం రేపిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి... ఈసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేశారు.
పొంగులేటికి త్వరలోనే పదవీ గండం తప్పదని అన్నారు. ఇటీవల ఈడీ దాడుల కారణంగా, పొంగులేటి పదవి కోల్పోతారని జోస్యం చెప్పారు. హన్మకొండలోని హంటర్ రోడ్డులో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో సీఎంకు, మంత్రులకు మధ్య సమన్వయం సత్సంబంధాలు లేవని విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా, ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ రాయడం సరికాదని అన్నారు.