జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు ఆనందించారు: సజ్జల

  • నిన్న విశాఖలో రుషికొండ ప్యాలెస్ పరిశీలించిన చంద్రబాబు
  • జగన్ ఎప్పుడూ అక్రమ కట్టడాలు నిర్మించలేదన్న సజ్జల
  • రుషికొండ ప్యాలెస్ జగన్ దే అయితే ఆయనకే రాసిచ్చేయండి అంటూ వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు నిన్న విశాఖలో పర్యటించిన సందర్భంగా రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించారు. దీనిపై, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు ఆనందించారని తెలిపారు. అయితే, ఆ భవనాలను జగన్ లగ్జరీ కోసం కట్టించుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. 

రుషికొండ ప్యాలెస్ జగన్ దే అంటున్నారు కదా... అలాగైతే ఆ భవనాన్ని జగన్ కే రాసిచ్చేయండి అని అన్నారు. చంద్రబాబు కట్టించిన అసెంబ్లీ భవనాలు చూస్తే ఆయన పాలన ఎలా ఉందో అర్థమవుతుందని విమర్శించారు. జగన్ ఏనాడూ అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని, చంద్రబాబే కరకట్ట అక్రమ నివాసంలో ఉంటున్నారని సజ్జల ఆరోపించారు. 

ఇవాళ... తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలోనే సజ్జల తాజా వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి, రోజా వంటి వైసీపీ అగ్రనేతలు కూడా హాజరయ్యారు.


More Telugu News