డబ్ల్యూటీసీ చార్ట్ లో కిందికి జారిన టీమిండియా
- న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా
- 0-3 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన
- డబ్ల్యూటీసీ స్టాండింగ్స్ లో రెండో స్థానం
- నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిన ఆసీస్
న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ను 0-3తో కోల్పోయిన టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో కిందికి జారింది. ముంబయి టెస్టులో కివీస్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమి అనంతరం... టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.
టీమిండియా వైఫల్యంతో, ఆస్ట్రేలియా జట్టు నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో వరుస ఓటముల ఫలితంగా డబ్ల్యూటీసీలో టీమిండియా 58.33 పాయింట్ల పర్సెంటేజీతో నిలిచింది. అదే సమయంలో, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న ఆసీస్ 62.5 పాయింట్ల పర్సెంటేజీతో కొనసాగుతోంది.
ఇక, భారత్ ను భారతగడ్డపైనే వైట్ వాష్ చేసిన తొలి జట్టు చరిత్ర లిఖించిన న్యూజిలాండ్ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో ఉంది.