భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. 18 పరుగులకే ముగ్గురు స్టార్లను కోల్పోయిన టీమిండియా

  • రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలిన కివీస్
  • ఓవర్ నైట్  స్కోరుకు మూడు పరుగులు మాత్రమే జోడింపు
  • రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లు పడగొట్టిన జడేజా
  • 147 పరుగుల లక్ష్య ఛేదనలో 18 పరుగులకే రోహిత్, కోహ్లీ, గిల్ అవుట్
తొలి రెండు టెస్టుల్లో దారుణంగా ఓడిన భారత జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పట్టుబిగించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 174 పరుగులకే కట్టడి చేసింది. ఫలితంగా భారత్ ఎదుట 147 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఓవర్ నైట్ స్కోరు 171/9 వద్ద మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్‌ మరో మూడు పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. 

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు నేలకూల్చిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అన్నే వికెట్లు తీసి న్యూజిలాండ్‌ ఆటకట్టించాడు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసి 28 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దీంతో భారత్ లక్ష్యంలో ఆ మేరకు స్కోరు తగ్గింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నాడు. 

147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత జట్టు 18 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11) మరోమారు నిరాశ పరచగా, శుభమన్ గిల్ ఒకే ఒక్క పరుగు చేసి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. కోహ్లీ ఒకే ఒక్క పరుగుకే అవుటై ఉసూరుమనిపించాడు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 129 పరుగులు అవసరం. 


More Telugu News