67వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం కోసం ఆస్ట్రేలియా వెళ్లిన పురందేశ్వరి

  • నేటి నుండి ఆస్ట్రేలియాలో 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు (సీపీసీ)
  • సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిన బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
  • మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టసభల్లో మహిళల ప్రాధాన్యం అంశాలపై చర్చించనున్న సీపీసీ
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు (సీపీసీ) జరుగుతోంది. ఈ క్రమంలో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలి హోదాలో ఆ సదస్సులో పాల్గొనేందుకు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు. 

ఈ సదస్సుకు 50 దేశాల నుండి ప్రతినిధులు హజరు అవ్వనున్నారు. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, చట్టసభల్లో మహిళల ప్రాధాన్యం తదితర అంశాలపై సీపీసీలో చర్చిస్తారు. సదస్సు ముగిసిన తర్వాత ఎంపీ ఈ నెల 11న ఇండియాకు తిరిగి వస్తారు.    


More Telugu News