డబ్బు కాదు.. మంచి ఆలోచన కావాలి: సీఎం చంద్రబాబు

  • విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు
  • కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష
  • ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విశాఖలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుషికొండపై గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా నాటి ప్రభుత్వ పెద్దల తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అనంతరం చంద్రబాబు విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. 

మెట్రో రైల్, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వచ్చ ఏపీ దిశగా వేగంగా అడుగులు వేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. పంచగ్రామాల సమస్యలను అధికారులు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. 

విశాఖలో రోడ్లపై ఎక్కడా గుంతలు ఉండటానికి వీలులేదని, ఎక్కడైనా గుంతల రోడ్లు ఉంటే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. పీ - 4 విధానంలో సంపద సృష్టిద్దామని, ఇందుకోసం డబ్బుకంటే మంచి ఆలోచనే ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. 


More Telugu News