మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ
- హైదరాబాద్‌లో విస్తరించనున్న మెట్రో రవాణా సౌకర్యం
- రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండో దశ
హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం జీవో 196ను జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండో దశను చేపడుతున్నారు.
మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర వాటా రూ.7,313 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు. అలాగే, జికా, ఏడీబీ, ఎన్డీబీ నుంచి రూ.11,693 కోట్ల రుణాలు తీసుకోనుంది. మెట్రో రెండో దశ నిర్మాణంతో మెట్రో రైలు రవాణా సౌకర్యాలు మరింత విస్తరించనున్నాయి.