'క' చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం: కిరణ్ అబ్బవరం
- 'క' చిత్రానికి సీక్వెల్
- 'కృష్ణగిరి ప్రత్యేకతలతో 'క' సీక్వెల్
- 'క' విజయం తన గౌరవం పెంచిందని చెప్పిన కిరణ్
'క' చిత్రం విజయంపై హీరో కిరణ్ అబ్బవరం స్పందించాడు. "ఈ సినిమా నాకు సక్సెస్‌తో పాటు గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాను అందరూ ఓన్ చేసుకున్నారు. హిట్ కొట్టాడు అనకుండా అందరూ హిట్ కొట్టేశాము అంటున్నారు'' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'క'. దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం పై విధంగా స్పందించాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ '' నన్ను గతంలో పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు మన ఇంటి అబ్బాయి అని అంటున్నారు. సినిమా టికెట్స్ కావాలని, దొరకటం లేదని, థియేటర్స్ పెంచాలని అడుగుతుంటే ఆనందంగా వుంది. ఈ నెల 8వ తేదీన మలయాళంలో కూడా 'క' సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ కుటుంబ సమేతంగా చిత్రాన్ని చూడటం ఆనందంగా ఉంది. అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ కనిపించడం సంతోషంగా ఉంది. ఈ ట్రెండ్ ప్రీమియర్స్ నుంచే మొదలైంది.
'క' సినిమా విజయం నాకు ఈ గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ విజయం నాలో బాధ్యతను పెంచింది. 'క' సినిమాకు సీక్వెల్ చేస్తాం. అది కూడా కృష్ణగిరి ఊరి ప్రత్యేకతలతో ఉంటుంది" అన్నారు. ఈ చిత్రాన్ని తన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఈ సినిమా ఏదో మ్యాజిక్ చేయబోతుందనే విషయాన్ని హీరో కిరణ్ తనకు ముందే చెప్పాడని, ఈ సినిమాతో మనం వంద కోట్లు కొడుతున్నామని కిరణ్ అన్నాడని వంశీ నందిపాటి తెలిపారు.
నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ "ఈ సినిమా చిత్రీకరణ సమయంలో గీత గోవిందంలో విజయ్ దేవరకొండలా కిరణ్ ఎక్కువగా మాట్లాడుతుంటే నేను మాత్రం రష్మికలా చాలా తక్కువగా మాట్లాడేవాడిని. ఆ రోజులు గుర్తుచేసుకుంటే ఆనందంగా ఉంది. త్వరలోనే 'క' సీక్వెల్ వివరాలు తెలియజేస్తాం" అన్నారు.