'లక్కీ భాస్కర్‌' కథను రిజెక్ట్‌ చేసిన క్రేజీ హీరో!

  • ప్రేక్షకులను అలరిస్తున్న 'లక్కీ భాస్కర్‌'
  • 'లక్కీ భాస్కర్‌' కథను నానికి చెప్పిన దర్శకుడు
  • తండ్రిగా నటించడానికి అభ్యంతరం చెప్పిన నాని 


దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్‌'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. భాస్కర్‌ అనే బ్యాంక్‌ ఉద్యోగి బ్యాంకింగ్‌ రంగంలోని లొసుగులను ఉపయోగించుకుని కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు అనే ఇంట్రెస్టింగ్‌ డ్రామాను చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. 

ముఖ్యంగా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ ఈ చిత్రానికి ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ముందు ధనుష్‌తో 'సార్‌' అనే చిత్రాన్ని రూపొందించాడు. ఆ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో ఏ హీరో సార్‌ చిత్రంలో నటించడానికి ముందుకు రాకపోవడంతో తమిళ కథానాయకుడు ధనుష్‌తో సార్‌ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. ఇక లక్కీ భాస్కర్‌ విషయానికొస్తే ఈ చిత్ర కథను కూడా ఆయన ముందుగా తెలుగు హీరోలకు చెప్పాడని తెలిసింది. 

అయితే అందులో క్రేజీ స్టార్‌ నాని కూడా ఒకరు. ఈ కథను విన్న నాని కొన్ని అభ్యంతరాల వల్ల ఈ కథను రిజెక్ట్‌ చేశాడని సమాచారం. ఆల్రెడీ తాను 'జెర్సీ' సినిమాతో పాటు 'హాయ్‌ నాన్న' చిత్రంలో తండ్రిగా నటించి ఉండటంతో మళ్లీ ఓ పిల్లాడి తండ్రిగా నటించడం బోర్‌గా ఉంటుందని తెలపడంతో వెంకీ అట్లూరి మలయాళ నటుడు దుల్కర్‌కు ఈ కథను వినిపించాడట. దుల్కర్‌ ఓకే చెప్పడంతో 'లక్కీ భాస్కర్‌' కార్యరూపం దాల్చింది. ఈ రోజు చిత్రానికి వస్తున్న స్పందన, వసూళ్ల గురించి అందరికీ తెలిసిందే. సో... 'లక్కీ భాస్కర్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన దుల్కర్‌ లక్కీ అని చెప్పాలి. 


More Telugu News