తొలిసారిగా రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన
- రుషికొండ చేరుకున్న సీఎం
- రుషికొండ భవనాల లోపలికి వెళ్లి చూసిన చంద్రబాబు
- ముఖ్యమంత్రికి వివరాలు తెలిపిన గంటా శ్రీనివాసరావు, అధికారులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా విశాఖ రుషికొండ ప్యాలెస్ సముదాయంలో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నిర్మించిన భవనాలను చంద్రబాబు నేడు పరిశీలించారు. ఈ మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్డుపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు... అనంతరం విశాఖలోని రుషికొండ చేరుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు వెంట మంత్రి కందుల దుర్గేశ్, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. రుషికొండ ప్యాలెస్ వివరాలను గంటా... సీఎం చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు అధికారులను అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకున్నారు. పలు భవనాల లోపలికి కూడా వెళ్లిన చంద్రబాబు... అక్కడి విలాసవంతమైన సౌకర్యాలను పరిశీలించారు.
కాగా, భవనాల నిర్వహణ ఖర్చు, విద్యుత్ బిల్లుల భారం ఎక్కువగా ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రుషికొండ భవనాలను ఎలా వినియోగించాలన్న దానిపై చర్చించాల్సి ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నట్టు తెలుస్తోంది.