ఛాంపియన్స్ ట్రోఫీ... టీమిండియా అభిమానుల కోసం పీసీబీ కీలక నిర్ణయం!
- వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్
- ఈ ట్రోఫీ కోసం భారత జట్టును పాక్‌కు పంపించేదిలేదంటున్న బీసీసీఐ
- వస్తుందనే ఆశాభావంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
- తమ దేశానికి వచ్చే భారత ఫ్యాన్స్‌కు త్వరితగతిన వీసాలిస్తామని పీసీబీ ప్రకటన
- భారత అభిమానుల కోసం ప్రత్యేక టికెట్ల కోటాను ఉంచుతామన్న మొహిసిన్ నఖ్వీ
వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) సన్నాహాలు చేస్తోంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దాయాది దేశానికి వెళ్లే విషయమై సందిగ్ధత నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లో ఈ ట్రోఫీ కోసం జట్టును పాక్‌కు పంపించేదిలేదని బీసీసీఐ చెబుతోంది.
మరోవైపు ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు తమ దేశానికి రావాలని, వస్తుందని పీసీబీ ఆశాభావంతో ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా ఫ్యాన్స్ కోసం పీసీబీ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తమ దేశానికి రావాలనుకునే భారత అభిమానులకు వీలైనంత త్వరగా వీసాలు జారీ చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ చెప్పారని ఓ న్యూస్ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది. లాహోర్ వేదికగా జరిగే దాయాది దేశాల మ్యాచ్‌ను భారత అభిమానులు పాక్ వచ్చి చూడాలని నఖ్వీ కోరినట్లు తెలిపింది.
"ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు మా దేశానికి వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. టీమిండియా ఫ్యాన్స్ కోసం వేగంగా వీసాలు జారీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. వారి కోసం ప్రత్యేక టికెట్ల కోటాను ఉంచడం జరుగుతుంది. పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లకు మేము ఆతిథ్యం ఇస్తాం. భారత జట్టు ఇక్కడికి రావాలి. వారు ఇక్కడికి రారని నేను అనుకోవట్లేదు" అని పీసీబీ ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఓ వార్తా పత్రికకు తెలిపారు.
ఇదిలాఉంటే... 2008లో ముంబయి ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాక్‌లో టీమిండియా పర్యటించడం మానేసింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగడం లేదు. ఇరు జట్లూ ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దీనిలో భాగంగా పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడుతోంది. కానీ, టీమిండియా మాత్రం తటస్థ వేదికల్లో మాత్రమే తలపడుతోంది.
ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, భారత జట్టు పాక్ వెళ్లడం దాదాపు అసాధ్యం. తటస్థ వేదికలో తమ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది.